Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసితో వాళ్లది అడ్డు చెప్తారనుకున్నాడు... ఫిక్స్ అనేసరికి జంప్ అయ్యాడు...

ఉప్పు-కారం, తీపి-చేదు, తప్పు-ఒప్పు వున్నట్లే ప్రేమికుల్లో మంచి ప్రేమికులు, దొంగ ప్రేమికులు అని రెండు రకాలు వుంటారు. మంచి ప్రేమికులు తాము ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయిని కడదాకా కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటారు. కానీ దొంగ ప్రేమికులు వాడుకున్నంత కాలం వ

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (17:35 IST)
ఉప్పు-కారం, తీపి-చేదు, తప్పు-ఒప్పు వున్నట్లే ప్రేమికుల్లో మంచి ప్రేమికులు, దొంగ ప్రేమికులు అని రెండు రకాలు వుంటారు. మంచి ప్రేమికులు తాము ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయిని కడదాకా కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటారు. కానీ దొంగ ప్రేమికులు వాడుకున్నంత కాలం వాడుకుని వదిలేస్తారు. సుమారుగా అలాంటి సంఘటనే అనుకునేట్లుగా ఓ ప్రేమ వ్యవహారం బయటపడింది. స్నేహితులుగా జర్నీ మొదలుపెట్టిన ఇద్దరు ప్రేమికులయ్యారు. 
 
తమ ప్రేమను పెద్దలక తెలియజేసేటపుడు ఏమయినా అడ్డుపడుతారేమోనని ప్రేమికుడు అనుకున్నాడు కానీ అలాంటిదేమీ లేకుండా అమ్మాయి (ప్రేయసి) తరపు వారు పెళ్లికి ఫిక్స్ అన్నారు. దాంతో పెళ్లికి రంగం సిద్ధమైంది. కానీ పెళ్లి ఘడియలు ముంచుకొచ్చే సమయానికి పెళ్లికొడుకు ఉరఫ్ ప్రేమికుడు జంప్ అయ్యాడు. ఈ ఘ‌ట‌న శ్రీ‌కాకుళం జిల్లాలోని నరసన్నపేటలో గురువారం నాడు చోటుచేసుకుంది. 
 
ఇరువురికీ ఇష్టమైన పెళ్లే కదా బ్రహ్మాండంగా జరిగిపోతుందనుకున్నవారందరికీ వరుడు షాకిచ్చాడు. పెళ్లి కుమారుడిని పిలుచుకురండీ అని పండితుడు పిలిచాక కాని తెలియలేదు అతడు జంపయ్యాడని. కాగా వరుడు ఎందుకలా పారిపోయాడో ఎవ్వరికీ అంతుబట్టలేదు. వధువు రాజ్యలక్ష్మి కూడా అతడు ఎందుకలా చేశాడో తనకి కూడా తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వధువు తరపువారు పోలీసులకు విషయాన్ని ఫిర్యాదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments