Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీసం మీద చెయ్యేసి చెబుతున్నా... పవన్ నాయుడే : బొండా ఉమ

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (19:50 IST)
వైకాపా మంత్రులు, నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ఓ రేంజ్‌లో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌పై వైకాపా నేతలు చేసిన వాటికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పైగా, మీసం మీద చెయ్యేసి చెబుతున్నా.. పవన్ నాయుడే అని చెబుతున్నా అని సవాల్ విసిరారు. 
 
రాజధాని అమరావతి కోసం సేకరించిన 33 వేల ఎకరాల భూముల్లో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ వైకాపా నేతలు గురువారం వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేశారు. వీటిని బొండా ఉమామహేశ్వర రావు కొట్టిపారేశారు. 
 
ముఖ్యంగా, పవన్‌ కల్యాణ్‌‌ను చంద్రబాబు దత్తపుత్రుడని వైకాపా ఎమ్మెల్యేలు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పవన్.. చంద్రబాబు దత్తపుత్రుడు అయితే.. వైకాపా నేతలైన మీరు జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలా అని మండిపడ్డారు. 
 
పైగా, పవన్‌ కల్యాణ్‌ పేరెత్తే అర్హత, స్థాయి మీకుందా అని ఆయన ప్రశ్నించారు. పెంపుడు కుక్కల్లాగా, పెయిడ్ ఆర్టిస్టుల లాగా ప్రెస్‌మీట్లు పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఒకడు పవన్ నాయుడని అంటున్నాడని, మీసం మీద చెయ్యేసి చెబుతున్నానని.. పవన్‌ నాయుడేనని, పవన్ పాలకొల్లు నాయుడని బోండా ఉమ వ్యాఖ్యానించారు. మీకు డౌట్‌గా ఉంటే మీ డీఎన్‌ఏలు చెక్‌ చేయించుకోండని వైసీపీ నేతలపై బోండా ఉమ విమర్శలు చేశారు. 
 
ఇన్‌సైడ్ ట్రేడింగ్ పేరుతో 25 వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని వైకాపా నేతలు ఆరోపించగా, ఇపుడు కేవలం నాలుగు వేల ఎకరాల భూములు మాత్రమే కొనుగోలు చేసినట్టు వెల్లడించారని బొండా ఉమ చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, వైసీపీ నేతల్లో కొందరు చంద్రబాబు అర్థాంగి నారా భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేయడాన్ని ఉమ తప్పుబట్టారు. రాజధాని అమరావతిలో మహిళల ఆవేదన చూసి భువనేశ్వరి చలించిపోయారని, అందుకే మద్దతు ఇచ్చారని వెల్లడించారు. కానీ భువనేశ్వరి గురించి కూడా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 
 
రాజధానిలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రతిసారి ఓ సామాజిక వర్గం అంటూ ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే కులాల లెక్క తీయాలని సవాల్ విసిరారు. కాగా, రాజధాని రైతుల పరిస్థితి చూసి కదిలిపోయిన నారా భువనేశ్వరి తన చేతి గాజులను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments