Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత ఇంటిపై బాంబుల దాడి...! తప్పిన ముప్పు..!

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (09:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రూపుదిద్దుకుంటున్న గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి కలకలం రేగింది. ప్రముఖ టీడీపీ నేత ఇంటిపై ప్రత్యర్థులు బాంబుల వర్షం కురిపించారు. అయితే అదృష్టవశాత్తూ ఆ బాంబులు ఆ నేత ఇంటి వరండాలోనే పడడంతో తృటిలో అపాయం తప్పింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ గాఢ నిద్రలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
 
గుంటూరు జిల్లా నాగిరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటనలో టీడీపీ నేత సీతారాంరెడ్డి ఇంటిపై ప్రత్యర్ధులు బాంబులు విసిరారు. అయితే, ఆయన బెడ్ రూంలో నిద్రిస్తుండడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. సీతారాంరెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, బాంబులు విసిరిన వ్యక్తుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ సంఘటన అక్కడ కలకలం రేపింది. కాగా పాత కక్ష్యల కారణంగా ఈ దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments