బ్లడ్ చంద్రగ్రహణం : తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

ఠాగూర్
ఆదివారం, 7 సెప్టెంబరు 2025 (18:18 IST)
బ్లడ్ చంద్రగ్రహణ ప్రభావం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 27,525 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అర్థరాత్రి 12 తర్వాత నిర్వహించే ఏకాంత సేవను మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి చేశారు.
 
భూవరాహస్వామి ఆలయంతో పాటు, అన్న ప్రసాద వితరణ కేంద్రాలను సైతం మూసివేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 50 వేల పులిహోర, బిస్కెట్‌ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని, అప్పటి నుంచే సర్వదర్శనం క్యూలైన్‌లోకి భక్తులను అనుమతిస్తామని తితిదే అధికారులు తెలిపారు.
 
చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట కోదండరామస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, సింహాచలం అప్పన్న, బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయం సహా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్ని మూసివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments