Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు పార్టీలో 14 మంది నల్లకుబేరులు... రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారట...

రాష్ట్ర విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే సహించేది లేదని పదేపదే చెపుతూ వచ్చారు. కానీ, ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన పోలేదు.

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (16:15 IST)
రాష్ట్ర విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే సహించేది లేదని పదేపదే చెపుతూ వచ్చారు. కానీ, ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన పోలేదు. అదేసమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కరెన్సీ స్ట్రైక్స్‌కు దిమ్మతిరిగిపోయింది. ప్రధాని మోడీ నిర్ణయం మాత్రం రెండు చేతులా సంపాదించిన పలువురు ఎమ్మెల్యేలకు మైండ్‌బ్లాంక్ అయ్యేలా చేసింది. 
 
ముఖ్యంగా కోస్తాలో ఉన్న ఎమ్మెల్యేల్లో 14 మంది టీడీపీ ప్రజాప్రతినిధులు తమ వద్ద ఉన్న బ్లాక్‌మనీని ఎలా మార్చుకోవాలో అర్థంకాక తీవ్రంగా మదనపడిపోతున్నారు. బయటకు చెప్పలేరు.. లోపల ఉంచుకోలేరు.. 30 శాతం డబ్బు ఇస్తే.. అంటే కోటి రూపాయలలో రూ.30 లక్షలు ఇస్తే మార్చిపెడతామని ఫోన్‌లు చేస్తున్న హవాలా వ్యాపారుల కోసం కొంతమంది ఎమ్మెల్యేలు వాకబు చేస్తున్నారు. 
 
మరికొంతమంది అనుచరుల ద్వారా బ్యాంకులలో పొలాలు ఉన్న రైతుల పేరుమీద డిపాజిట్లు వేయిస్తున్నారు. ఇలా ఎవరి బాధలు వారు పడుతున్నారు. కానీ ఈ 14 మంది ఎమ్మెల్యేల వద్ద నోట్లకట్టలు మూలుగుతున్నాయన్న సంగతి గూఢచారి వర్గాల ద్వారా చంద్రబాబు వరకూ వెళ్లింది. ఆదాయపు పన్నుశాఖ అధికారులు నిఘా వేస్తారని తెలియడంతో ఆ ఎమ్మెల్యేలు కిక్కురుమనడం లేదు. తొలుత తమ బ్లాక్‌మనీని బంగారు బిస్కెట్ల రూపంలోకి మార్చుదామని ప్రయత్నించినప్పటికీ ఐటీనిఘా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments