Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంతలు పూడ్చలేని ప్రభుత్వం.. గోతులు తీసే రాజకీయం...

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (12:20 IST)
రాష్ట్ర రహదారులపై గుంతలు పూడ్చుకోలేని ఏపీ ప్రభుత్వం, గోతులు తీసే రాజకీయం చేస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రో ధరల ప్రభుత్వం వితండవాదం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంతో సమానంగా పెట్రో ధరలు పెంచిన ప్రభుత్వం, తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించడం లేదని నిలదీశారు. రాజధాని నిర్మాణం పేరిట రూ. 4 సెస్ వసూలు చేస్తూ, రాజధానిని ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. అలాగే, రహదారి సెస్ పేరుతో రూ.2 వసూలు చేస్తూ, గోతులు ఎందుకు పూడ్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 
'కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు రూ. 19 వేల కోట్లే ఇచ్చిందని మీరు అంటున్నారు. అసలు కేంద్రం ఎంత ఇచ్చిందో లెక్క చెప్పండి? అంటూ ఆయన డిమాండ్ చేశారు. మాటిస్తే మడమ తిప్పనన్న జగన్ రాజధానిపై మాటెందుకు తప్పారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments