Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది రాచరిక జమానా కాదు... కేంద్రం చూస్తోంది : సుజనా చౌదరి

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (17:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాచరిక జమానాలో లేదని ప్రజాస్వామ్య దేశంలోనే ఉందనే విషయాన్ని పాలకులు గుర్తుపెట్టుకోవాలని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీపై ఆయన స్పందించారు. 
 
ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారిని బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉందన్నారు. ఏపీలో అయోమయ, అంధకార పాలన సాగుతోందని ఆరోపించారు. రాజ్యాంగ సంక్షోభం దిశగా ఏపీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. 
 
'ఇది రాచరిక జమానా కాదు.. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇలా చేయడం సరికాదు. ఐదు నెలలుగా అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా హోల్డ్‌లో ఉంచారు. సామాజికవర్గాలుగా సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 
 
అయితే, ఈ చర్యలన్నింటినీ కేంద్రం గమనిస్తోంది.. కళ్లు మూసుకుని లేదు. ఇసుక ద్వారా కేవలం రూ.300 కోట్ల వరకే ఆదాయం, అంతకు మించి రాదు. ఇసుక కొరత, వరదల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments