వైకాపా హయాంలో ఎటు చూసిన భూకబ్జాలే : బీజేపీ నేత సత్యకుమార్

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (16:51 IST)
ఏపీలోని అధికార వైకాపా పార్టీ హయాంలో ఎటు చూసిన భూ కబ్జాలే జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్‌ ఆరోపించారు. ఏపీకి వైకాపా రూపంలో చెద పట్టిందని విమర్శించారు. రాష్ట్రం పూర్తిగా సోమాలియా, సూడాన్‌, పాకిస్థాన్‌, శ్రీలంక మాదిరి తయారవుతోందని ప్రజలంతా భావిస్తున్నారని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
'రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వైకాపా సర్కార్‌ నెరవేర్చట్లేదు. రాష్ట్రంలోని అన్నదాతలకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లిస్తున్నారు. నరేగా నుంచి వస్తున్న నిధులు కూడా దారి మళ్లిస్తున్నారు. పేదల కోసం కేంద్రం ఇస్తున్న లక్షల ఇళ్లు పూర్తి చేయడం లేదని ఆరోపించారు. 
 
'మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లిస్తున్నారు. పక్క రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇదేంటని ప్రశ్నించిన ప్రజలపై వైకాపా నేతలు భౌతిక దాడులకు దిగుతున్నారు. నిరసన తెలిపే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారు' అని సత్యకుమార్‌ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments