Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ఛైర్మన్ పదవిని హీరో శివాజీకే ఇస్తారా? టీడీపీలో చర్చ!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (18:07 IST)
టిటిడీ ఛైర్మన్ రేసులో తాను కూడా ఉన్నట్టు యువ హీరో శివాజీ చేసిన కామెంట్స్ ఇపుడు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి. టీటీడీ ఛైర్మన్ గిరీ తనను వెతుక్కుంటూ వస్తుందని, పదవి కోసం పైరవీలు చేయబోనని ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూలో శివాజీ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీంతో, టీటీడీ ఛైర్మన్ పదవిపై మరోసారి దుమారం చెలరేగింది. టీడీపీలో కలకలం మొదలైంది. 
 
టీటీడీ ఛైర్మన్ పదవిలోనే కొనసాగాలని కనుమూరి బాపిరాజు తాపత్రయపడుతుండగా, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, నగరి మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆశలు పెట్టుకున్నారు. కాగా, రాయపాటి సాంబశివరావుకు ఎప్పటి నుంచో టీటీడీ ఛైర్మన్‌గా ఎన్నికవ్వాలని కోరిక. 
 
అలాగే మాగంటి మురళీమోహన్ కు కూడా తిరుపతి వెంకన్న సేవలో తరించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆశావహుల జాబితా ఇలా ఉంటే... టీటీడీ ఛైర్మన్ పదవి చదలవాడదేనని టీడీపీ వర్గాలు ఘంటాపథంగా చెపుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఆగస్టులో టీటీడీ పాలక మండలిని రద్దు చేసినప్పటికీ, కొత్త పాలకమండలిని నేటికీ నియమించలేదు. 
 
ఇంతలో టాలీవుడ్ హీరో శివాజీ టీటీడీ ఛైర్మన్ పదవిపై కన్నేసి, ఆ పదవి తనను వెతుక్కుంటూ వస్తుందని వ్యాఖ్యానించడం ఇపుడు టీడీపీలో కలకలం రేగుతోంది. ఈ మేరకు బీజేపీ నాయకత్వం కూడా ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments