Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెంపుల్ సిటీలో కొత్త కల్చర్‌.. బైక్‌ రేసులతో యువత జోరు... ప్రాణాలు హరి

ఆధ్మాత్మిక నగరంలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చింది. కుర్రకారుల్లో జోష్‌ కనిపిస్తోంది. రోడ్డుపైకి ఎక్కారంటే రయ్‌మంటూ దూసుకువెళ్ళాలని తెగ ఆరాటపడిపోతున్నారు. ఇంతకాలం హైదరాబాద్‌, విశాఖ వంటి మహానగరాలకే పరిమ

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (16:17 IST)
ఆధ్మాత్మిక నగరంలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చింది. కుర్రకారుల్లో జోష్‌ కనిపిస్తోంది. రోడ్డుపైకి ఎక్కారంటే రయ్‌మంటూ దూసుకువెళ్ళాలని తెగ  ఆరాటపడిపోతున్నారు. ఇంతకాలం హైదరాబాద్‌, విశాఖ వంటి మహానగరాలకే పరిమితమైన బైక్‌ రేసులు ఇప్పుడు తిరుపతిలో జోరుగా సాగుతున్నాయి. స్టార్టింగ్‌లోనే ఈ రేంజ్‌లో ఉందంటే ఈ వ్యవహారం కొంతకాలం నడిస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న భయం నెలకొంది తిరుపతి వాసుల్లో..
 
బైక్‌ రేసింగ్‌లు కొత్త కాకపోయినప్పటికీ తిరుపతికి మాత్రం అది కొత్తే. ఇంతవరకు ఎన్నో పాశ్చాత్య సంస్కృతులను తనలో కలుపుకున్న తిరుపతి ఇప్పటివరకు రేసింగ్‌ల సంస్కృతి వద్దకు వెళ్ళలేదు. అయితే తాజాగా తిరుపతి కుర్రకారు జోరుగా రేసింగ్‌లు ఆడుతున్నారు. వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలతో కూడా రేస్‌ ఆడుకుంటున్నారు. అనుమతి లేకుండా అడ్డదిడ్డంగా బైక్‌ రేసింగ్‌లను నిర్వహిస్తూ మధ్యలో వచ్చే జనాల ప్రాణాలను తీస్తున్నారు. 
 
తాజాగా తిరుపతి ఎస్వీనగర్‌కు చెందిన షర్మిళ అనే మహిళ బైక్‌ రేసింగ్‌ బారిన పడింది. అర్థరాత్రి టీ షాపులో పని ముగించుకుని షాపులో మిగిలిపోయిన చెత్తను చెత్తబుట్టలో వేయడానికి వెళుతుండగా అప్పటికీ బైక్‌ రేసింగ్‌లో జోరుగా ఉన్న ఒక యువకుడు ఆమెను ఢీకొట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో తిరుపతిలో బైక్‌ రేసింగ్‌లు జోరుగా సాగుతున్నాయన్న సమాచారం బట్టబయలైంది. 
 
రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్‌లు నిర్వహిస్తే ఇలాంటి బైక్‌ రేసులను ఈజీగా గుర్తించవచ్చు. కానీ కొంతకాలంగా తిరుపతి పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించడం లేదు. దీంతో అర్థరాత్రి తిరుపతి యువకులు ఇష్టానుసారంగా ఈ రేసులకు పాల్పడుతున్నారు. వారి ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమే కాకుండా ఎదుటివారి ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని తిరుపతి వాసులు కోరుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments