Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియారెడ్డి : అవి పోటీ చేయక పోవడం వల్లే...

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:04 IST)
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియారెడ్డి ఏకగ్రీవంగా శుక్రవారం ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి నుంచి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనట్టు ధృవీకరణ పత్రాన్ని అందుకున్న ఆమె మాట్లాడుతూ... ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం పట్ల సంతోషంగా ఉందన్నారు. 
 
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు బరిలో లేక పోవడం వల్లే తాను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు చెప్పారు. పైపెగా.. పోటీలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారని, అందువల్లే తాను తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని వినమ్రంగా తెలిపారు. 
 
తన తల్లి ఏ విధంగా పేదల కోసం పనిచేశారో.. అదేవిధంగా తాను పని చేస్తూ తన తల్లి ఆశయ సాధన కోసం పాటుపడతానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కుటుంబ సభ్యులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. వైకాపా అధినేత జగన్‌కు, నియోజకవర్గ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments