Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఫోటోకు దండం పెట్టి దీపం పెట్టకుండా పడుకోడు అధ్యక్షా : అఖిలప్రియ

'మా అమ్మ శోభా నాగిరెడ్డి ఫోటోకు దండం పెట్టి.. దీపం పెట్టకుండా పడుకోడు అధ్యక్షా' అంటూ హఠాన్మరణం చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియా రెడ్డి చెప్పారు.

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (12:16 IST)
'మా అమ్మ శోభా నాగిరెడ్డి ఫోటోకు దండం పెట్టి.. దీపం పెట్టకుండా పడుకోడు అధ్యక్షా' అంటూ హఠాన్మరణం చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియా రెడ్డి చెప్పారు. భూమా నాగిరెడ్డి మృతికి మంగళవారం ఏపీ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా ఇందులో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, సభ్యులు పాల్గొని మాట్లాడారు. విపక్షం వైకాపా మాత్రం ఈ సంతాప తీర్మానానికి దూరంగా ఉంటూ సభ నుంచి వాకౌట్ చేసింది.
 
ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియా రెడ్డి సభలో తన తండ్రి గురించి మాట్లాడారు. ఎప్పుడైతే అమ్మ చనిపోయారో, అప్పటినుంచి ఆయన కోలుకోలేక పోయారు. ఆయన ఎంత బిజీగా ఉంటే, అంత త్వరగా మరచిపోతారని మేము అనుకున్నాం. కానీ బయటకు ధైర్యంగా ఉన్నా, రోజూ రాత్రి అమ్మ ఫోటోకు దండం పెట్టి దీపం పెట్టకుండా పడుకోడు అధ్యక్షా అంటూ అఖిలప్రియ కళ్ల వెంబడి నీరు పెట్టుకున్నారు.
 
భార్య మరణం తర్వాత ఆయన ఎంత ప్రయత్నించినా, బాధ నుంచి బయటకు రాలేకపోయారని, దాంతో ఆరోగ్యం మెల్లిమెల్లిగా పాడవుతూ వచ్చిందని చెప్పారు. గత వారమంతా ఆయన ఆసుపత్రిలో ఉన్నారని, ఆ సమయంలో కూడా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఆలోచించారని, ఆఖరికి టెలీ కాన్ఫరెన్స్‌లోనూ పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. 
 
ఆక్సిజన్ మాస్క్‌తోనూ ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంపై మాట్లాడారాని గుర్తు చేసుకున్నారు. తాను మరణిస్తానేమోనని ఆయన ముందుగానే ఊహించినట్టు ఇప్పుడు అనిపిస్తోందని, అందుకే చివరిరోజుల్లో నంద్యాల, ఆళ్లగడ్డ అభివృద్ధి, పేదలందరికీ ఇళ్లు కట్టించాలని గట్టి ప్రయత్నాలు చేశారని, ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments