Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ : ల్యాండ్ పూలింగ్‌పై జోక్యం చేసుకోండి.. రైతుల వినతి

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (11:01 IST)
హీరో పవన్ కళ్యాణ్‌కు తుళ్లూరు రైతులు ఒక విజ్ఞప్తి చేశారు. కొత్త రాజధాని నిర్మాణం కోసం అవసరమయ్యే భూములను సేకరించే నిమిత్తం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ల్యాండ్ పూలింగ్ విధానంపై పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. 
 
ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం తమ వద్ద ఉన్న భూములను లాక్కుంటుంటే ఎందుకు స్పందించడం లేదని మంగళగిరి బేతపూడి గ్రామానికి చెందిన రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో మీరు అండగా ఉన్నామని చెప్పడంతోనే మీరు చెప్పిన పార్టీకి ఓట్లేశాం. ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతోంది. అందుకోసమే మీ స్పందన కోసం రోడ్డెక్కాల్సిన పరిస్ధితి దాపురించింది అంటూ బేతపూడికి చెందిన 30 మంది రైతులు ఆందోళనకు దిగారు. 
 
బేతపూడి గ్రామానికి 450 ఎకరాలు ఉండేదని, 30 ఏళ్ల కిందట ఉడా 250 ఎకరాలు తీసుకోవడంతో 200 ఎకరాలు మిగిలిందని వారు తెలిపారు. తాజాగా మిగిలిన 200 ఎకరాలను కూడా తీసుకుంటామన్న ప్రభుత్వం ఏడాదికి రూ.30 వేలు ఇస్తానంటోందని, ఇది ఏ మూలకు సరిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తరపున పవన్ కళ్యాణ్ పోరాటం చేయాలని వారు కోరుతున్నారు. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments