తనపై సామూహిక లైంగిక దాడి జరిగిందని.. అది కూడా తన స్నేహితుడి ఎదుటే జరిగిందని అబద్ధం చెప్పిన ఓ యువతికి ఇబ్బందులు తప్పలేదు. తనపై లైంగిక దాడికి పాల్పడిన స్నేహితుడిని రక్షించేందుకు ఓ కట్టుకథ అల్లింది. కానీ
తనపై సామూహిక లైంగిక దాడి జరిగిందని.. అది కూడా తన స్నేహితుడి ఎదుటే జరిగిందని అబద్ధం చెప్పిన ఓ యువతికి ఇబ్బందులు తప్పలేదు. తనపై లైంగిక దాడికి పాల్పడిన స్నేహితుడిని రక్షించేందుకు ఓ కట్టుకథ అల్లింది. కానీ ఇబ్బందుల్లో పడింది. పోలీసుల విచారణలో అసలు నిజం బహిర్గతమైంది.
ఆ యువతిపై స్నేహితుడే లైంగిక దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి బెగంపూర్ ఏరియాలో ఉంటున్న ఓ 16ఏళ్ల యువతి స్నేహితుడితో కలిసి పార్కుకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి ఆలస్యంగా వచ్చింది.
ఇంట్లో వాళ్లు ఎందుకు ఆలస్యం అయిందని గట్టిగా మందలించడంతో తన స్నేహితుడిని రక్షించేందుకు, ఇంట్లో వాళ్ల తిట్లదండకం నుంచి బయటపడేందుకు తనపై సామూహిక లైంగిక దాడి జరిగిందని, తన స్నేహితుడి ముందే నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని కట్టుకథ చెప్పింది.
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. స్నేహితుడిని పిలిచి విచారించడంతో.. అతడిని రక్షించేందుకు యువతి కట్టుకథ అల్లిందని తెలిసింది. నిజం దాచే ప్రయత్నం చేసినందుకు బాధితురాలిని మందలించారు. యువకుడిని అరెస్ట్ చేశారు.