Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీషపై ఆ ముద్ర వేస్తున్నారు.. తేజస్విని కేసు పెడితే ఎందుకు వదిలేస్తున్నారు?

హైదరాబాదులోని ఫిల్మ్ నగర్‌లోని ఆర్జీఏ స్టూడియోలో ప్రాణాలు కోల్పోయిన బ్యూటీషియన్ శిరీష కేసులో పోలీసులు చెప్తున్న విషయంలో నిజం లేదని ఆమె కుటుంబ సభ్యులు పైర్ అవుతున్నారు. పోలీసులు చెప్పే విషయంలో వాస్తవం

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (14:50 IST)
హైదరాబాదులోని ఫిల్మ్ నగర్‌లోని ఆర్జీఏ స్టూడియోలో ప్రాణాలు కోల్పోయిన బ్యూటీషియన్ శిరీష కేసులో పోలీసులు చెప్తున్న విషయంలో నిజం లేదని ఆమె కుటుంబ సభ్యులు పైర్ అవుతున్నారు. పోలీసులు చెప్పే విషయంలో వాస్తవం లేదని.. ఉద్యోగం చేసుకునే ఆడపిల్లలపై వ్యభిచారి ముద్ర వేస్తున్నారని.. ఉద్యోగం చేసుకోవడమే తమ కుమార్తె చేసిన నేరమా? అంటూ శిరీష తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తన కుమార్తె విషయంలో న్యాయం కోసం మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామన్నారు. పోలీసులు న్యాయం చేయాలని బాధితులు వారిని ఆశ్రయిస్తే.. అలాంటి పోలీసులే అత్యాచారయత్నం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కేసులో తేజస్విని గురించి ఎవరూ మాట్లాడడం లేదని, కేసులో ప్రధాన భాగం ఆమేనని తెలిపారు. కేసు పెట్టింది ఆమే కాబట్టి.. ఆమె పాత్ర వివరాలేంటో బయటకు రావాలని డిమాండ్ చేశారు.
 
కాగా బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యేనని.. సైంటిఫిక్ ఆధారాలతో ఆమెది ఆత్మహత్యగానే నిర్ధారించినట్లు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఏళ్ల పాటు ఎస్సైగా పని చేసి, ఎన్నో కేసులు చూసిన ఎస్సై ప్రభాకర్ రెడ్డి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తేల్చేశారు. ఈ కేసులో రాజీవ్‌‌ కీలక సూత్రధారి అయితే అతడిని నిందితుల్లో ఏ2గా చేర్చగా, ఏ1గా శ్రావణ్‌ను నిర్ధారించారు. 
 
రాజీవే శిరీషతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, అతడిని నమ్మి ఎస్సై వద్దకు ఆమె వెళ్ళిందని.. ఆపై రాజీవే శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఆమెను ఫ్యాన్ నుంచి కిందికి దించినట్లు తెలిపాడు. అయితే ఇతడిని ఏ2గా నిర్ధారించడం ఏమిటనే ప్రశ్న తలెత్తింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments