Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు రేవ్ పార్టీ : కీలక పాత్ర పోషించిన మంత్రి కాకాణి అనుచరుడు!

ఠాగూర్
ఆదివారం, 26 మే 2024 (09:16 IST)
ఇటీవల బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో గుట్టుగా సాగుతున్న రేవ్ పార్టీని బెంగుళూరు పోలీసులు బహిర్గతం చేశారు. ఈ పార్టీలో అనేక సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే, ఈ రేవ్ పార్టీ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ముఖ్య అనుచరుడు కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, అన్నమయ్య జిల్లా రాయచోటి వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల అనుచరులు కూడా ఉన్నట్టు సమాచారం. 
 
కాగా, ఇప్పటికే పార్టీలో మంత్రి కాకాణి పేరు ఉన్న కారు స్టిక్కర్‌ను సీబీఐ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన పూర్ణారెడ్డి అనే వ్యక్తి అరెస్టు చేశారు. రేవ్ పార్టీ ఏర్పాటులో ఆయనది ముఖ్యపాత్ర అని, ఆయన మంత్రి అనుచరుడేనని పోలీసుల ధృవీకరించారు. ఇప్పటికే అరెస్టయిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు అరుణ్ కుమార్ సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు వెల్లడించారు. ఆ పార్టీలో పాల్గొన్న సినీ నటి హేమ సహా మొత్తం ఎనిమిది మందికి సీసీబీ పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు  వైద్య పరీక్షల్లో బయటపడిందని తెలిపారు. వీరిలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments