Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలక్రిష్ణ మరో సంచలన నిర్ణయం.. ఏంటది?

అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు, నటుడు బాలక్రిష్ణ వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గాన్ని మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. హిందూపురం నుంచి పోటీ చేసినా ప్రజలకు అందుబాటులో లేకపోవడం.. అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చి వెళ్ళడంతో ఆ నియోజకవర

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (13:18 IST)
అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు, నటుడు బాలక్రిష్ణ వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గాన్ని మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. హిందూపురం నుంచి పోటీ చేసినా ప్రజలకు అందుబాటులో లేకపోవడం.. అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చి వెళ్ళడంతో ఆ నియోజకవర్గ ప్రజలు బాలయ్యపై గుర్రుగా ఉన్నారు. ఈ విషయం కాస్త బాలక్రిష్ణ దృష్టికి వెళ్ళిందట. దీంతో నియోజకవర్గాన్ని మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 
 
వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో బాలక్రిష్ణ ఉన్నారట. ఈ నియోజకవర్గం టిడిపికి కంచుకోట. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపొందవచ్చు. హిందూపురం నుంచి పోటీ చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వున్నట్లు బాలయ్యకు సమాచారం వస్తోందట.
 
మరోవైపు ఇప్పటికే విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వెలగపూడి రామక్రిష్ణ ఉన్నారు. బాలక్రిష్ణ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే తను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆ ఎమ్మెల్యే ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించారు. దీంతో పాటు టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు బాలక్రిష్ణను ఇక్కడి నుంచే పోటీ చేయించేలా ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. 
 
అయ్యన్నపాత్రుడికి, బాలక్రిష్ణకు మధ్య మంచి స్నేహమే ఉంది. ఇక్కడి నుంచి బాలక్రిష్ణను పోటీ చేయిస్తే మంత్రి గంటా శ్రీనివాస్‌కు చెక్ పెట్టినట్లేనని అయ్యన్నపాత్రుడి ఆలోచనగా వున్నట్లు చెప్పుకుంటున్నారు. విశాఖ జిల్లాలో ఒకే పార్టీలో ఉన్నా సరే అయ్యన్నపాత్రుడు, మంత్రి గంటా శ్రీనివాసరావులు ఎడమొఖంపెడమొఖంలా ఉంటారని గతంలో పలు సంఘటనలు చూపించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments