Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణపై హిందూపురం ప్రజలు గుర్రుగా వున్నారా? ఎందుకు?

బాలకృష్ణ. నందమూరి కుటుంబంలో ప్రస్తుతం కీలక రాజకీయ నేతగా ఉన్న వ్యక్తి. ఎప్పటి నుండో తండ్రి రాజకీయాల్లో ఉన్నా ఆ రంగం వైపు వెళ్ళకుండా సినిమాల్లో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో పాటు అభిమానుల ఒత్తిడితో

Webdunia
శనివారం, 15 జులై 2017 (18:19 IST)
బాలకృష్ణ. నందమూరి కుటుంబంలో ప్రస్తుతం కీలక రాజకీయ నేతగా ఉన్న వ్యక్తి. ఎప్పటి నుండో తండ్రి రాజకీయాల్లో ఉన్నా ఆ రంగం వైపు వెళ్ళకుండా సినిమాల్లో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో పాటు అభిమానుల ఒత్తిడితో రాజకీయాల్లోకి వచ్చిన బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందుపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇది తెలిసిందే. అయితే ప్రజాప్రతినిధిగాను, సినిమాల్లోను రెండింటికి పూర్తిస్థాయిలో బాలకృష్ణ న్యాయం చేయలేకపోతున్నారన్న విమర్శలు లేకపోలేదు. 
 
అందుకు కారణం అభివృద్ధి జరగకపోవడమే. సినిమాల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ పెద్దగా నియోజవర్గాల్లో పర్యటించలేదట. అప్పుడప్పుడు పర్యటించి వెళ్ళిపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమం పూర్తిగా కుంటుపడుతోంది. దీంతో నియోజకవర్గ ప్రజలు బాలకృష్ణపై కోపంతో ఉన్నారట. విషయాన్ని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న బాలకృష్ణ ఎలాగైనా తిరిగి ప్రజల ఆదరాభిమానాలను పొందాలని, దాంతో పాటు హిందూపురంలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి తీరాలన్న ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే కొంతమంది సలహాలను తీసుకున్న బాలకృష్ణ తనపై ప్రజలకు ఉన్న కోపాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలా అని చర్చించారట. 
 
కనీసం వారానికి ఒకసారైని నియోజవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవాలని, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే తిరిగి తనను ఆదరిస్తారని తెలియడంతో ఆవైపు బాలకృష్ణ అడుగులు వేస్తున్నారట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments