Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పనిచేయడంలో బాబు కన్నా బాలక్రిష్ణే బెటర్... ఎమ్మెల్యే రోజా...

సంచలనానికి మారుపేరు రోజా. ఆమె నోరు తెరిచిందంటే చాలు, ప్రత్యర్థులు నోరు మూసుకోవాల్సిందే. అధికార తెలుగుదేశం పార్టీ నేతలైతే చెప్పనవసరం లేదు. చెవులు, నోరు రెండూ మూసేసుకుంటారు. వ్యక్తిగతంగా కూడా రోజా విమర్శలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. వైజాగ్‌ల

Webdunia
సోమవారం, 29 మే 2017 (12:39 IST)
సంచలనానికి మారుపేరు రోజా. ఆమె నోరు తెరిచిందంటే చాలు, ప్రత్యర్థులు నోరు మూసుకోవాల్సిందే. అధికార తెలుగుదేశం పార్టీ నేతలైతే చెప్పనవసరం లేదు. చెవులు, నోరు రెండూ మూసేసుకుంటారు. వ్యక్తిగతంగా కూడా రోజా విమర్శలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. వైజాగ్‌లో జరుగుతున్న మహానాడును పనికిరాని మహానాడంటూ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగలేదు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు కన్నా బాలక్రిష్ణే ఎంతో బెటరని, బాబు నోరు తెరిస్తే అంతా అబద్ధాలేనన్నారామె.
 
ప్రజలను మోసం చేయడంలో బాబును మించిన సిద్ధహస్తుడు మరొకరు లేరని, మసిబూసి మారేడు కాయి చేయడంలో బాబుది అందవేసిన చేయిగా అభివర్ణించారు. మామను వెన్నుపోటు పొడిచిన బాబు ఏమీ తెలియని అమాయకుడి లాగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చెప్పడం మరింత విడ్డూరమన్నారు. ప్రజలు బాబు పాలనపై విసిగిపోయారని, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకన్నా బాలక్రిష్ణ అధ్యక్షుడుగా ఉండటం ఉత్తమమని చెప్పారు. 
 
ఎన్‌టిఆర్ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే బాలక్రిష్ణకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటున్నారు రోజా. అయితే రోజా వ్యాఖ్యలపై టిడిపి నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే మహానాడులో నాయకులందరూ బిజీగా ఉండటంతో ఆమె వ్యాఖ్యలు టిడిపి నేతలు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments