Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి తొలి రోజు కలెక్షన్లు దేశంలో 70 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లు, వారాంతానికే 240 కోట్లు.. రాళ్లా, రూపాయలా..

ఒక మెగాస్టార్ సినిమా చేసిన మొత్తం వసూళ్లు కేవలం ఒక్కరోజులో ఒక సినిమాకు వచ్చేస్తే.. ఆ ప్రభంజనం పేరు బాహుబలి2. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినీరంగ చరిత్రలో మరే చిత్రానికీ సాధ్యం కాని మహాద్బ

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (05:50 IST)
ఒక మెగాస్టార్ సినిమా చేసిన మొత్తం వసూళ్లు కేవలం ఒక్కరోజులో ఒక సినిమాకు వచ్చేస్తే.. ఆ ప్రభంజనం పేరు బాహుబలి2.  తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినీరంగ చరిత్రలో మరే చిత్రానికీ సాధ్యం కాని మహాద్బుతాన్ని రాజమౌళి తీసిన బాహుహలి2 సృష్టించనుంది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి సినిమా ఒకరోజు వసూల్లు 130 కోట్లకు చేరుకోనున్నాయన్న వార్త వింటేనే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మల్లువుడ్ స్టార్ హీరోల గుండెలదిరిపోయేటట్లుంది. దేశంలో ఒక రోజు కలెక్ష్లన్లు 70 కోట్లు కాగా, ప్రపంచమంతటా ఒక రోజు కలెక్షన్లు 130 కోట్ల రూపాయలని ప్రాథమిక అంచనా బట్టి తెలుస్తోంది. ఇక ఈ వారాంతానికి అంటే శుక్ర, శని, ఆదివారం మూడు ోజులకు బాహుబలి2 230నుంచి 240 కోట్లు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక హిందీ అనువాద చిత్రం తొలి రోజున 40 కోట్లు సంపాదిస్తుందని, వారాంతానికి 100 కోట్లు సంపాదిస్తుందని ట్రేడ్ నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు.
 
ఒక మాటలో చెప్పాలంటి ఇది న భూతో న భవిష్యతి
 
ఎలా సాధ్యం. ఇదెలా సాధ్యం. దేశవ్యాప్తంగా 6,500 థియేటర్లలో విడుదలైన బాహుబలి2 చిత్రం వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకుని శుక్రవారం 70 కోట్లు వసూళ్లు వస్తాయని ట్రేడ్‌ పండితులు అంచనా వేశారు. వారాంతానికి 230 నుంచి 240 కోట్ల రూపాయలు వసూలు చేయడం ఖాయమని ఎగ్జిబిటర్‌ అక్షయ్‌ రతి అంటున్నారు. 
 
హిందీ అనువాదం మొదటి రోజున 40 కోట్లు వసూలు సాధిస్తుందని, వారాంతానికి 100 కోట్లు దక్కించుకుంటుందని ట్రేడ్‌ విశ్లేషకుడు కోమల్‌ నహతా అంటున్నారు. మొదటి రోజు కలెక్షన్ల పరంగా ‘బాహుబలి–2’ రికార్డ్‌ బ్రేక్‌ చేస్తుందని కూడా ఆయన అన్నారు. ఇండియన్‌ సినిమాల్లో ‘బాహుబలి’ బిగ్గెస్ట్‌ హిట్‌ కావడం ఖాయం అని కూడా పేర్కొన్నారు. అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలు పీకే, దంగల్, సుల్తాన్‌ల రికార్డులను ‘బాహుబలి’ బద్దలు కొట్టడం ఖాయం అని కోమల్‌ నహతా పేర్కొన్నారు. 
 
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా మొదటి రోజు 70 కోట్లు వసూళ్లు సాధిస్తే.. ఓవర్సీస్‌తో కలుపుకుని 130 కోట్లు సాధించిందన్నది బాక్సాఫీస్‌ వర్గాల సమాచారం.
 
ఇది చరిత్ర ఎరుగని సంరంభం. అంతర్జాతీయ యవనికపై తెలుగు సినిమాను అలా నిలబెట్టిన బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టడం ఈ తరం దర్సకులకు, హీరోలకు సాధ్యం కాదన్నది బాహుబలి అంత సత్యం.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments