Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరు ఉరిమారు.. మరొకరు వెక్కిరించారు.. అసెంబ్లీలో బాబు జగన్

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (17:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో సోమవారం విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పరస్పరం ఇరుకున పెట్టుకోవడానికి పాలక, ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. చంద్రబాబు, జగన్ లు ఒకరిని ఒకరు హావబావాలతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలు నవ్వు తెప్పించాయి. 
 
బాబు హావాభావాలను చూపుతున్న జగన్
రైతు రుణమాఫీ చర్చ జరుగుతుండగా మొదట చాలా సేపు చంద్రబాబు నాయుడు సభలో లేరు. అనంతరం ఆయన విచ్చేశారు. ఆయన రాక మునుపు నుంచే జగన్ మాట్లాడుతున్నారు. చర్చలో భాగంగా జగన్ రైతు రుణమాఫీకి సంబంధించి కేస్ స్టడీలను వివరిస్తున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ గత యేడాది ఎలా ఉంది? ఈ యేడాది ఎలా ఉంది? ఎందుకు తక్కువ వచ్చాయనే అంశాలను చెబుతున్నారు. ఇంతలోనే చంద్రబాబు లేచి చాలా సీరియస్ గా అర్థం చేసుకునే కెపాసిటీ లేకపోతే తామేమి చేయలేమని చెబుతున్నారు.

కొందరు దొంగలను ప్రోత్సహిస్తున్నారంటూ ప్రతిపక్షంపై మండిపడ్డారు. వారి కోసమే ప్రతిపక్షం ఇలా మాట్లాడుతోందంటూ గుడ్లు ఉరిమి చూశారు. దీనిపై స్పందించిన జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు కళ్ళు ఇంత పెద్దవి చేసి మాట్లాడడం చూస్తుంటే, నిజంగా భయమేస్తుందని అన్నారు. కళ్ళు పెద్దవి చేసి కళ్ళార్పకుండా మరీ అబద్దాలు చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు విసరడంతో సభలో ఘొల్లున నవ్వులు వినిపించాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments