Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు జపాన్ పర్యటన : ఏపీలో జపాన్ ఇసుజు పరిశ్రమ

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (11:35 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం తన జపాన్ పర్యటనలో భాగంగా నాలుగోరోజు ఇసుజు, మయేవక సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో పికప్ ట్రక్స్ తయారీ సంస్థను పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రముఖ ఆటోమోబైల్ సంస్థ ఇసుజు ప్రతినిధులు ప్రకటించారు. 
 
తమకు 10 ట్రక్ తయారీ సంస్థలు ఉన్నాయని, మరో ట్రక్ తయారీ సంస్థను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్ అన్నివిధాలా అనుకూలమైందని ఇసుజు సంస్థ ఉపాధ్యక్షుడు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌తో తమ సంస్థతోపాటు పలు జపాన్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు.  
 
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జపాన్‌కి, ఆంధ్రప్రదేశ్‌కి చాలా అంశాల్లో దగ్గర పోలికలున్నాయి. మాదేశం నుంచి మీరు బుద్ధిజాన్ని స్వీకరించారు. మీ నుంచి మేం సంస్కృతి, కష్టించి పనిచేసే తత్వాలను నేర్చుకున్నాం. బుద్ధిజం పర్యాటకాన్ని శ్రీకాకుళం, అమరావతిల్లో అభివృద్ధి చేస్తాం. జపనీస్ భాషను మా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెడతామన్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments