Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంద్రాగ‌స్టు ప‌రేడ్ గౌండ్ లో క‌రోనా అలెర్ట్!

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (12:05 IST)
ఈసారి పంద్రాగ‌స్టు వేడుక అంతా క‌రోనా అలెర్ట్ తో కొన‌సాగుతున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో ఈ వేడుక‌ల‌కు ప‌రిమిత సంఖ్య‌లో అతిథుల‌ను ఆహ్వానిస్తున్నారు.

విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ ప‌రిశీలించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కొనసాగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు, వేడుకల రిహార్సల్స్ ను అయ‌న ద‌గ్గ‌రుండి చూశారు.

పోలీస్ పరేడ్, ముఖ్యమంత్రి ప్రసంగం, మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో పటిష్టమైన బద్రత చర్యలు చేపడుతున్న పోలీస్ శాఖ ఈసారి కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తోంది.

డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, కోవిడ్ దృష్ట్యా వివిఐపి, విఐపిలతో పాటు పరిమితి స్థాయిలో మాత్రమే సందర్శకులకు అనుమతి ఉంటుంద‌న్నారు. వర్షంలో సైతం పరేడ్ కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం... ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం అని డిజిపి చెప్పారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments