Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఆశీస్సులు - మీ అభిమానం ఎప్పుడూ ఇలానే ఉండాలి... అచ్చెన్నాయుడు

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (14:58 IST)
ఆంధ్రప్రదేశ్ టీడీపీ శాఖ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన పేరును సోమవారం అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా పార్టీకి కొత్త రూపు కల్పించే క్రమంలో భారీస్థాయిలో మార్పులుచేర్పులు చేశారు. నూతన పొలిట్ బ్యూరోను, అనేక కమిటీలను ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని నియమించారు. రాష్ట్ర టీడీపీ బాధ్యతలు తనకు అప్పగించడం పట్ల అచ్చెన్నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.
 
దీనిపై అచ్చెన్నాయుడు ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "ఈ రోజు మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలతో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితుడ్నయ్యాను. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తనకు ఈ అవకాశం కల్పించారని వివరించారు. మీ ఆశీస్సులు, మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నా.. మీ కింజరాపు అచ్చెన్నాయుడు అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
 
కాగా, పొలిట్ బ్యూరోలోకి బాలకృష్ణ 
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా కె. అచ్చెన్నాయుడు పేరును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ.. తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్‌గా ఎల్.రమణనే కొనసాగించనున్నారు.
 
ఇకపోతే, టీటీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసినిని ప్రకటించారు. 27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీని, 25 మందితో పొలిట్ బ్యూరో కమిటీని ఏర్పాటు చేశారు. పొలిట్ బ్యూరోలో నందమూరి బాలకృష్ణకు స్థానం కల్పించారు.
 
పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొండా ఉమ, ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్ కుమార్ గౌడ్‌ను నియమించారు. 
 
పొలిట్ బ్యూరోలో నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, ఎల్.రమణ కూడా ఉన్నారు. ఇదేసమయంలో పార్టీ అధికార ప్రతినిధులుగా ఆరుగురికి చంద్రబాబు అవకాశం కల్పించారు. వీరిలో ఎమ్మెల్సీ అశోక్ బాబుతో పాటు తెలంగాణ నుంచి నండూరి నర్సిరెడ్డి, జ్యోత్స్న, నజీర్, ప్రేమ్ కుమార్, దీపక్ రెడ్డిలు కొనసాగనున్నారు. కాగా, గతంలో ఏపీ శాఖ అధ్యక్షుడుగా కళా వెంకట్రావు ఉన్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments