Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వద్దా?: సిఐటియు

Webdunia
మంగళవారం, 12 మే 2020 (21:23 IST)
రాజధానిలో పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన  బాట పట్టి ఐదు రోజులు అవుతున్నప్పటికీ అధికారులు ఏజెన్సీ బాధ్యులు స్పందించకపోవడం అన్యాయమని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు ఎం రవి అన్నారు.
 
ఎర్రబాలెం పంచాయతీ కార్యాలయం వద్ద నాలుగు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారంనాడు ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి రవి మాట్లాడుతూ.. ఏజెన్సీకి పారిశుద్ధ్య పనులు అప్పగించిన సీఆర్డీఏ అధికారులు ఏజెన్సీ కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వకుండా కాల్చుకు తింటుంటే చోద్యం చూడటం ఏమిటని రవి ప్రశ్నించారు.

ఏజెన్సీ బాధ్యులు రాజధాని లోని 29 గ్రామాలలో  ఏ గ్రామంలోనైనా ఎ ఒక్క పారిశుద్ధ్య  కార్మికుడు కైనా చేతులు కడుక్కునేందుకు ఒక్క సోపు అయినా ఇచ్చారా అని అన్నారు.

ఇప్పటికైనా సీఆర్డీఏ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని రాజధాని పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించాలని కార్మికులకు రక్షణ చర్యలు చేపట్టాలని పని భద్రత కల్పించాలని రవి డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments