Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతనో కానిస్టేబుల్.. ఫిర్యాదు కోసం వచ్చే మహిళలను..?

Webdunia
శనివారం, 26 జులై 2014 (17:16 IST)
అతనో కానిస్టేబుల్.. చేసేది మాత్రం దుర్మార్గపు పనులు. ఇబ్బందుల్లో ఉన్నాం.. రక్షించండి అంటూ పోలీసులను ఆశ్రయించే మహిళలకు కూడా ఇలాంటి కానిస్టేబుళ్లతో కష్టాలు తప్పేలా లేవు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే సతీష్ అనే కానిస్టేబుల్ అందరికీ ఎస్సైనని, స్టేషన్ వ్యవహారాలు చూసేది తానేనని నిందితులు, బాధితులను నమ్మిస్తాడు. 
 
ఫిర్యాదు కోసం వచ్చే మహిళలను క్వార్టర్స్‌లోని తన రూంకు రప్పించుకుని లైంగిక వేధింపులు ఆరంభిస్తాడు. ఒప్పుకుంటే సరే లేకుంటే బెదిరింపులకు దిగుతాడు. ఇదీ అతని అసలు స్వరూపం. ఇతనిపై చాలా ఆరోపణలున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విశేషం. 
 
గతంలో ఇతను పెదవేగి పోలీస్ స్టేషన్‌లో పని చేసినప్పుడు ఓ యువతిని ప్రేమపేరుతో మోసం చేశాడు. దీనిని భరించలేని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో జీలుగుమిల్లి క్వార్టర్స్‌లో ఇతని వ్యవహారశైలిపై మండిపడ్డ స్థానికులు కిటికీకి ఓ రహస్య కెమెరా ఏర్పాటు చేసి అతను మహిళల్ని ఎలా లొంగదీసుకునేది వీడియో తీసి ఉన్నతాధికారులకు అందజేశారు. దీంతో అతనిపై విచారణకు ఆదేశించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు