Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికుల వినోదం కోసం డ్యాన్స్ చేసిన ఆర్టీసీ కండక్టర్... ఆ తర్వాత ఏం జరిగింది? (Video)

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (15:21 IST)
చిన్నపాటి రోడ్డులో ముందు కర్రల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ కారణంగా ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సును పక్కని ఆపేశాడు. ఆ తర్వాత ప్రయాణికులకు వినోదం అందించే నిమిత్తం బస్సు ముందు డ్యాన్స్ చేశాడు. దీన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. దీన్ని చూసిన ఆర్టీసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారు. 
 
ఆ డ్రైవర్ పేరు లోవరాజు. కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన రౌతులపూడి నుంచి తుని డిపోకు వెళుతుండగా మార్గమధ్యంలో కర్రల లోడు ట్రాక్టర్ అడ్డొచ్చింది. చిన్న రోడ్డు కావడం, బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో బస్సును నిలిపివేశాడు. అదేసమయంలో ఆ యువకుడు వీడియో తీస్తుండటంతో లోవరాజు బస్సు ముందు డ్యాన్స్ చేసే ప్రయాణికులను వినోదం పంచాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆర్టీసీ అధికారులు అతడికి విధులు కేటాయించకుండా పక్కనబెట్టారు.
 
ఈ వీడియోను చూసిన మహిష్మ కే అనే యూజర్ స్పందిస్తూ మీరు ట్వీట్ చేయకముందే ఈ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారట అన్నా.. దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోండి. క్రమశిక్షణ, సమయ పాలన ముఖ్యమేకానీ హాని చేయని వినోదం నేరం కాదని పేర్కొన్నారు. 
 
అమెరికాలోని ఉన్న లోకేశ్‌ ఈపోస్టు చూసిన వెంటనే స్పందించారు. సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేస్తారని వెంటనే అతడిని ఉద్యోగంలోకి తీసుకుంటారని, తాను వచ్చిన వెంటనే వీలు చూసుకుని లోవరాజును కలుస్తారని మరో పోస్టు చేశారు. లోకేశ్ పోస్టుతో లోవరాజును అధికారులు మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments