Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు.. దిశ చట్టం.. రాష్ట్రపతి ఆమోదంపై చర్యలు.. జగన్

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (15:57 IST)
రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దిశ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంకా రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇంకా దిశ పోలీస్ స్టేషన్‌లోనే వన్ స్టాప్ సెంటర్, డీ అడిక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు కావాలన్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలు వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. దిశ చట్టంపై మీద ప్రతి నెలా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు తోపాటు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలని సీఎం అన్నారు.
 
ప్రధానంగా దిశ యాప్‌ను ఎలా వినియోగించాలన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని అన్నారు. దిశ యాక్ట్ అమలుపై క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, వినియోగించే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చె్పారు. 
 
ఎస్‌ఎంఎస్‌ సహా వివిధ మార్గాల్లో సమాచారం పంపాలని సీఎం స్పష్టం చేశారు. స్మార్ట్‌ ఫోన్లలో మాత్రమే కాకుండా అన్ని ఫోన్లలో కూడా దిశ యాప్‌ సదుపాయాలు ఉండేలా చూడాలని, ఇందుకోసం టెలికాం కంపెనీలతో మాట్లాడాలన్న సీఎం ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments