Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌గ్గేదేలే ... మేమూ ఉద్యోగులమే! అన్న ఏపి ట్రెజరీ అకౌంటెంట్లు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (18:05 IST)
ఏపీలో ఇపుడు పి.ఆర్.సి. యుద్ధం తార స్థాయికి చేరుతోంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో చ‌ర్చ‌ల అనంత‌రం, అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యం తీసుకుంటా అని చెప్పారు. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కు హ‌ఠాత్తుగా జీవోలు విడుద‌ల అయ్యాయి. ఇందులో ఐ.ఆర్.తోపాటు హెచ్.ఆర్.ఎ. కూడా త‌గ్గించేసి, పి.ఆర్.సి.ని ప్ర‌క‌టించ‌డంతో ఉద్యోగులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. సీఎంతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను దుమ్మెత్తి పోశారు. దీనితో ఉద్యోగ సంఘాలు పి.ఆర్.సి. జీవో ర‌ద్దుకు డిమాండు చేస్తూ నిర‌స‌న‌లు తెలుపుతున్నాయి.

 
ఈ ద‌శ‌లో త‌గ్గించిన పి.ఆర్.సి. తో ప్ర‌భుత్వం జీతాలు ఇచ్చేందుకు చేసే ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ప్రాసెస్‌ చేసేందుకు ట్రెజరీ ఉద్యోగులు నిరాకరించారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు జీవోలు జారీ చేసింది. ఈజీవోల ప్రకారం ఈనెల 25లోగా వేతనాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం ట్రెజరీ అధికారులను ఆదేశించింది.


అయితే తాము కొత్త పీఆర్‌సీ ప్రకారం జీతాలను ప్రాసెస్‌ చేసేందుకు ట్రెజరీ అధికారులు, డ్రాయింగ్‌ అధికారులు నిరాకరించారు. తాము కూడా ఉద్యోగుల్లో భాగమేనని వారు అంటున్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లిస్తూ, జీతం పెరిగినట్లు బిల్లులు చేయడానికి వీరు నిరాకరిస్తున్నారు. దీనితో సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్ల‌యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments