ఏపీ సీఎం జగన్‌కు మోసకార్ అవార్డు ఇవ్వాలి : అచ్చెన్నాయుడు

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (13:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైవిధ్యభరితమైన నటుకు ఆస్కార్ కాకుండా మోసకార్ అనే అవార్డును ఇవ్వాలని టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆస్కార్ అవార్డుకు మించి నటించారని ఎద్దేవా చేశారు. అందుకే జగన్ రెడ్డి ఆస్కార్ కాకుండా మోసకార్ అని ఇవ్వాలని ఆయన కోరారు. 
 
ప్రత్యేక హోదాపై వైసీపీ లోపాయికారితనం, చేతకానితనం మరోసారి బహిర్గతమైందని ఆయన ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనప్పుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. సీఎం, వైసీపీ ఎంపీలు వెంటనే వారి పదవులకు రాజీనామా చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
 
వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి నేటి వరకు ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. ఏపీ ప్రజలు నిత్యం ఏదో ఒక సమస్యపై విచారం వ్యక్తం చేస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు. 
 
సమస్యలపై గళమెత్తిన వారిని వైసీపీ ప్రభుత్వం అనిచివేస్తోందని ఆయన అన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై విముఖత ఏర్పడుతోందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నిక్లలో ప్రజలే వైసీపీకి బుద్దిచెబుతారని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments