Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు - ప్రశ్నపత్రాల సంఖ్య 7 మాత్రమే...

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (09:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ ఏడో తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ పదో తరగతి పరీక్షల ప్రాథమిక షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. 
 
ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 7న పరీక్షలు ప్రారంభం కానుండగా 15న ముగుస్తాయి. ఫీజును ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 10లోగా చెల్లించాల్సి ఉంటుంది. జవాబు పత్రాల మూల్యాంకనం జూన్ 17 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఫలితాలను జులై 5న ప్రకటించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.
 
కాగా, ఇప్పటివరకు 11గా ఉన్న ప్రశ్న పత్రాలను ఈసారి ఏడుకు కుదించారు. భౌతిక, రసాయన శాస్త్రాలకు కలిపి సైన్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. జీవశాస్త్రంలో మరో పేపర్ ఉంటుంది. మిగిలిన ఐదు సబ్జెక్టులకు ఒక్కో పేపర్ ఉంటుంది. 
 
కొవిడ్ నేపథ్యంలో ఇప్పటివరకు పాఠశాలలు మూతపడడం వల్ల వేసవి సెలవులను రద్దు చేసిన ప్రభుత్వం.. రెండో శనివారం, ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం వంద రోజుల పదో తరగతి ప్రణాళికను సిద్ధం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు

Pushpa-2 కొత్త రికార్డ్-32 రోజుల్లో రూ.1,831 కోట్ల వసూలు.. బాహుబలి-2ను దాటేసింది..

Nayanthara: మళ్లీ వివాదంలో చిక్కుకున్న నయనతార.. ధనుష్ బాటలో చంద్రముఖి?

Honey Rose: హనీ రోజ్‌ను వేధించిన ఆ ధనవంతుడు ఎవరు?

ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments