Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఏసీ ఛైర్మన్ ఎంపిక... వైకాపాలో చిచ్చు.. నేతల తిరుగుబాటు... జగన్‌ను కడిగిపారేసిన అమర్నాథ్!

Webdunia
మంగళవారం, 22 మార్చి 2016 (13:09 IST)
ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) ఛైర్మన్ ఎంపిక విషయం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాలో చిచ్చురెపింది. పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న భూమా నాగిరెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెల్సిందే. దీంతో ఆ పదవికి వైకాపా నుంచి ఓ నేతను ఎంపిక చేయాల్సి వచ్చింది. దీంతో అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీలోని సీనియర్ నేతల్లో ఏ ఒక్కర్నీ సంప్రదించకుండా కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి పేరును ఎంపిక చేశారు. ఇదే ఆ పార్టీలో చిచ్చు రేపింది. 
 
నిజానికి ఖాళీ అయిన పీఏసీ ఛైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్ నాథ్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, వైసీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ యత్నించారు. అయితే, ఈ ముగ్గురికి షాక్ ఇచ్చేలా రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్ ఎంపిక చేయడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
దీనిపై మంగళవారం ఉందయం అమర్నాథ్ రెడ్డి బహిరంగంగానే నిరసన గళం వినిపించారు. తనకు పదవి రాలేదన్న విషయాన్ని అంతగా ప్రస్తావించని ఆయన... కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతులకు పీఏసీ ఛైర్మన్ పదవి వస్తుందని భావించామన్నారు. అయితే ఏ ఒక్కరితో చర్చించకుండానే జగన్... రాజేంద్రనాథ్ రెడ్డి పేరును ప్రకటించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయన తన అసంతృప్తిని పరోక్షంగా వెళ్లగక్కారు. చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు తెలివి కలిగిన వారని అందరూ అనుకుంటారని, అయితే ఆ జిల్లాకు చెందిన నేతలే తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

Show comments