బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో ఏపీ అధికారులు నిమగ్నం

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (21:50 IST)
గత నెల రోజుల వ్యవధిలో బ్రిటన్ నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చిన మొత్తం 1,148 మందిలో ఇప్పటి వరకూ 1,040 మంది జాడ కనుగొన్నామని, ఇందులో 18 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని, మరో 90 మంది జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్వె ల్లడించారు. 

ఇందులో 982 మందిని క్వారంటైన్లో వుంచామని, వీరిలో నలుగురికి కోవిడ్-19 పాజిటివ్ లక్షణాలు కన్పించటంతో తాజాగా బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త వైరస్ స్ట్రెయిన్ లక్షణాలున్నాయో లేదో పరిశీలించేందుకు వారి రక్త నమూనాలను పుణేలోని ఎన్ఐవి ల్యాబ్ కు పంపామని  ప్రకటనలో వివరించారు.

దీనిపై ఎవరూ ఎటువంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, ఈ వైరస్ వ్యాప్తి నివారణకు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు సోమవారం నుండి కృష్ణా జిల్లాలో వ్యాక్సిన్ ట్రయల్ రన్ ను ఐదు ప్రాంతాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, ఇందుకు సంబంధించిన వెబ్ ఆధారిత సాఫ్ట్ వేర్ కూడా సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఒకటి లేదా రెండు జిల్లాల్లో వ్యాక్సిన్ ట్రయల్ రన్ నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తాము కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాటంనేని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments