Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం మంత్రి అయితే కోర్టుకు రారటనా.. అయితే అరెస్టు చేసి తీసుకురండి: కోర్టు ఆదేశం

ఏపీ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై ఎన్నికల కేసు విచారణకు గైర్హాజరు కావడంతో తీవ్రంగా మందలించడమే కాకుండా, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీ చేస

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (10:17 IST)
ఏపీ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై ఎన్నికల కేసు విచారణకు గైర్హాజరు కావడంతో తీవ్రంగా మందలించడమే కాకుండా, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంటే.. మంత్రి గంటాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత 2009లో జరిగిన సాధారణ ఎన్నికలో గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. అదే సంవత్సరం ఏప్రిల్‌ 4న పట్టణంలోని ఆయన కార్యాలయంలో క్రికెట్‌ కిట్లు, చీరలు దొరికాయి. వీటికి సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
దీనిపై అనకాపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. వాయిదాలకు మంత్రి హాజరు కాకపోవడంతో రెండో అదనపు జూనియర్‌ సివిల్‌జడ్జి జె.వి.వి.ఎన్‌.సత్యనారాయణ మూర్తి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేశారు. వచ్చేనెల 11న విచారణకు హాజరవ్వాలని వారెంట్‌లో పేర్కొన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments