Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహా.. ఏమి వినయం : వైవీఎస్ ముందు మోకరిల్లిన ఏపీ మంత్రి

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతున్నట్టు లేదు. అధికార పార్టీ నేతలకు ప్రజలు మోకరిల్లాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. పదవులు దక్కినవారు మాత్రం వైకాపా పెద్దల వద్ద మోకరిల్లుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ తితిదే ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి మోకారిల్లారు. వైవీఎస్ కాళ్ళ వద్ద తాను ఒక రాష్ట్ర మంత్రిననే విషయాన్ని విస్మరించి మోకరిల్లారు. 
 
కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఎ.వేమవరంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభ జరిగింది. ఇందులో వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి అనేక మంది వైకాపా నేతలు భారీ సంఖ్యలో వచ్చారు. వేదికపై వైఎస్ఎస్‌తో పాటు అనేక వైకాపా నేతలు ఆశీనులైవున్నారు. ఈ కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వచ్చిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వేదికపైకి రాగానే వైవీ సుబ్బారెడ్డి కాళ్ల వద్ద మోకరిల్లి రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ, చిట్టబ్బాయి కుటుంబానికి ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక సాయం అందించారని, అందుకు కారకులైన సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌కు ఎన్ని జన్మలైనా శెట్టి బలిజలుగా శిరస్సు వంచి నమస్కరిస్తానని వ్యాఖ్యానించారు. అయితే, ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూ ఓ వ్యక్తి వద్ద మోకరిల్లడం ఇపుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి ప్రీ రిలీజ్- బాధతో అల్లాడిపోయిన ప్రభాస్.. కాలి గాయం తగ్గలేదా? (video)

వరల్డ్ కప్ సెమీఫైనల్‌తో కల్కి పోటీ పడుతుందా? అదో తలనొప్పి!

విజువల్ ఫీస్ట్ లా కన్నప్ప టీజర్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments