Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

ఠాగూర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (17:15 IST)
కొత్త రేషన్ కార్డులపై ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేవైసీ నమోదు పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డులపై దృష్టిపెడతామన్నారు. ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేస్తామని తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాలు అన్ని ఈ కోర్డులోనే ఉంటాయని, రేషన్ కార్డు అనికాకుండా ఫ్యామిలీ కార్డుగా అది ఉంటుందన్నారు. ఏటీఎం కార్డు తరహాలోనే స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తామని వెల్లడించారు. 
 
రైతులకు భరోసా కల్పించేలా 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు తెలిపారు. రైతులకు ఏ మిల్లుకు కావాలంటే ఆ మిల్లుకు ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం కంటే 20 శాతం తేమ అధికంగా ఉన్న ధాన్యం కొనుగోలు చేసేందుకు కూడా అనుమతి ఇచ్చామన్నారు. 
 
బియ్యం అక్రమ రవాణాలో 65 వేల టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వెహికల్స్ సీజ్ చెయ్యమని కూడా చెప్పామని, గతంలో ఎన్నడూ లేనివిధంగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వాహనాలను సీజ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. కాకినాడలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఎప్పటికపుడు తనిఖీలు జరుగుతున్నాయన్నారు. దీపం పథకం గత దీపావళి రోజు ప్రారంభమైందన్నారు. దీపం పథకం మొదటి దశలో 99 లక్షలకు మంది లబ్దిదారులు లబ్ధి పొందారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments