Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడే చంద్రబాబును అంతమొందించి ఉండాల్సింది : ఏపీ మంత్రి కొడాలి నాని

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (11:06 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని ఏపీ మంత్రి కొడాలి నాని మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో మంత్రి నాని విలేకరులతో మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడే చంద్రబాబును జైలుకు పంపించి అంతమొందించి ఉండాల్సిందన్నారు. 
 
అలా జరిగి ఉంటే గుంటూరు లాంటి సంఘటనలు ఇప్పుడు జరిగేవి కాదన్నారు. ఎస్సీ మహిళ శవాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పనిలోపనిగా నారా లోకేశ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
విద్యాకానుక కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు లోకేశ్ కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను అడ్డుకుంటున్న చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. 
 
మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయాలన్నదే ప్రభుత్వం అభిమతమని, అందుకనే దిశ చట్టం, యాప్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు. గుంటూరు యువతిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు 12 గంటల్లోనే అరెస్టు చేశారని, ఏపీ పోలీసులు సమర్థవంతంగా పని చేస్తుంటే వారిపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments