మంత్రి జోగి రమేష్‌కు షాకిచ్చిన బామ్మర్దులు... టీడీపీ తీర్థం!!

వరుణ్
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (17:21 IST)
వైకాపా నేత, మంత్రి జోగి రమేష్‌కు ఆయన సొంత కుటుంబ సభ్యులు తేరుకోలేని షాకిచ్చిచారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం మైలవరంలో జోగి రమేష్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవుండగా, ఆయన బంధువులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా టీడీపీలో చేరారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నేతలు నిమగ్నమైవున్నారు. గురువారం నుంచి నామినేషన్లు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు మారుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా మంత్రి జోగి రమేష్‍‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సాక్షాత్తూ సొంత బామ్మర్దులు, బంధువులు వైకాపాకు టాటా చెప్పేశారు. వారు సైకిల్ ఎక్కేశారు. 
 
మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఉదయం మంత్రి జోగి రమేష్‌కు షాకిస్తూ, ఆయన సొంత బామ్మర్దులు పామర్తి దుర్గా ప్రసాద్, పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వర రావులు టీడీపీ చేరారు. వీరితో పాటు జోగి రమేశ్‌‍కు చెందిన 40 మంది బంధువర్గం కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంది. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి ముందు సభా వేదికను ఏర్పాటు చేసి మరీ వీళ్లంతా టీడీపీలో చేరారు. అయితే, ఈ అంశంపై మంత్రి జోగి రమేష్ స్పందించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments