Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి దెయ్యాల రాజధాని.. సెలవిచ్చిన ఏపీ వైకాపా మంత్రి

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (17:18 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వైకాపా నేతలు తమ నోటికొచ్చినట్టు సంభోదిస్తున్నారు. గతంలో ఈ అమరావతిని శ్మశాన వాటికతో పోల్చారు. అలాంటి చోట మనుషులు నివసించలేరంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు వ్యాఖ్యానించారు. ఇపుడు మరో ఏపీ మంత్రి అమరావతిని దెయ్యాల రాజధానిగా అభివర్ణించి తన నోటి దూలను తీర్చుకున్నారు. పైగా, మూడు రాజధానులపై కొత్త బిల్లును తీసుకొచ్చి ముందుకెళ్లాతమని స్పష్టం చేశారు. ఆ మంత్రి పేరు గుడివాడ అమర్నాథ్. రాష్ట్ర పరిశ్రమలశాఖా మంత్రి. ఆయన తాజాగా మాట్లాడుతూ, అమరావతి దేవతల రాజధాని కాదన్నారు. అది ఒక దెయ్యాల రాజధాని అని వ్యాఖ్యానించారు. 
 
ఈ నెల 12వ తేదీన అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు మహా పాదయాత్రను చేపట్టనున్నారు. దీనికి ఏపీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించడంతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించారు. కానీ, వైకాపా మంత్రి అమర్నాథ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామన్నారు. ఇది వరకు ప్రతిపాదించిన బిల్లుపై పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో కొత్త బిల్లును తీసుకునిరానున్నట్టు తెలిపారు. పనిలోపనిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఘాటైన విమర్శలు గుప్పించారు. గాడిదకు కొమ్ములు వచ్చినా.. ముసలోడికి పిచ్చి వచ్చినా భరించడం కష్టమన్నారు. ఇపుడు చంద్రబాబు వ్యాఖ్యలు అదే తరహాలో ఉన్నాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments