Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక్క పాఠశాల కూడా మూసివేయలేదు : మంత్రి బొత్స

Webdunia
శనివారం, 16 జులై 2022 (16:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూసివేయలేదని ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పాఠశాలల విలీనం పేరుతో రాష్ట్రంలోని అనేక పాఠశాలను మూసివేస్తున్నారు. దీంతో విద్యార్థులు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల టీసీలను తీసుకుని తమకు సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కడా ఒక్క పాఠశాలలను మూసివేయలేదని.. అలా ఎక్కడైనా జరిగితే రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా తాను బాధ్యత వహించనున్నట్లు తెలిపారు. 3, 4, 5 తరగతుల విలీనం తర్వాత ఫౌండేషన్‌ స్కూల్స్ తీసుకొస్తామన్నారు. 
 
విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొనే జీవో 117కు సవరణ చేసినట్లు చెప్పారు. అలాగే విద్యార్థుల సంఖ్య 21 దాటితే మరో ఎస్జీటీ ఉపాధ్యాయుడిని నియమిస్తామన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే ప్రధాన ఉపాధ్యాయుడి నియామకం చేపడుతామన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments