పవన్ చిత్రాలు ఎందుకు ఫ్లావ్ అవుతున్నాయంటే : మంత్రి అవంతి వివరణ

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (12:21 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటానికి కారణాలను ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వివరించారు. రాష్ట్రానికి టూరిస్టుగా వచ్చే పవన్‌ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడటం ఏంటని ఆయన అన్నారు. పవన్‌కు అహంభావం అధికంగా ఉంటుందన్నారు. అందుకే ఆయన సినిమాల్లో అధిక శాతం ప్లాప్ అవుతున్నాయని జోస్యం చెప్పారు. పవన్ సినిమాల్లో విజయాలకంటే ఎక్కువ పరాజయాలే అధికంగా ఉన్నాయని మంత్రి అవంతి సెలవిచ్చాచారు.
 
గుంటూరులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో వైకాపాను లక్ష్యంగా చేసుకుని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. వీటికి వైకాపా మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందిస్తూ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదవడం తప్ప పవన్‌కు వాస్తవాలు తెలియవన్నారు. 
 
తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా గత మూడేళ్ళ కాలంలో జనసేన కార్యకర్తలపై గూండాగిరి చేశానని పవన్ కళ్యాణ్ నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు. అలా చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ఒకవేళ నిరూపించలేకపోతే పవన్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని మంత్రి సవాల్ విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments