Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవినేని ఉమ ఆడో.. మగో తెలియట్లేదు : మంత్రి అనిల్ కుమార్

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (09:41 IST)
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోమారు నోటికి పనిచెప్పారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టుగా దేవనేని ఉమ ఆడో.. మగో తెలియడం లేదని చెప్పుకొచ్చారు. 
 
నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి అనిల్ పాల్గొని మాట్లాడుతూ, 'కేసీఆర్‌ అన్నట్టు ఉమా అంటే ఆడో, మగో తేడా తెలియదు. ఆయన సీఎంపైన, నాపైన విమర్శలు చేస్తుండటం సిగ్గుచేటు. నన్ను ఉత్తర కుమారుడని ఉమా మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో ఉత్తర కుమారుడు లోకేశ్‌ అన్న సంగతి అందరికీ తెలుసు. రాజకుమారుడు మందబుద్ధి, భయంతోపాటు రేలంగి లాగా సైజులున్న వ్యక్తి లోకేశే. 
 
నాకు భయమంటే ఏమిటో తెలియదు. మండలిలో అడుగు దూరం నుంచి లోకేశ్‌ నన్ను చూశాడు. నా కళ్లలో కాని, గుండెలోకాని భయం కనపడిందోమో ఉత్తరకుమారుడిని అడిగి తెలుసుకోవాలి. ఎవరిని చంపి ఉమా రాజకీయాల్లోకి వచ్చాడో విజయవాడలో ప్రతి ఒక్కరికీ తెలుసు' అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. 
 
టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీ తప్ప ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. పోలవరాన్ని చంద్రబాబు చేత పూర్తి చేయించడం భగవంతుడికి కూడా ఇష్టం లేదన్నారు. అందుకే శంకుస్థాపన తండ్రి చేస్తే ప్రారంభోత్సవాన్ని కుమారుడు జగన్‌ చేయబోతున్నాడన్నారు. 2021 కల్లా పోలవరాన్ని పూర్తి చేసి తీరుతామని, దీనిని రాసిపెట్టుకోవాలని ఉమాకు మంత్రి అనిల్ కుమార్ సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments