వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు దక్కించుకుని జగన్ పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అందులో చిత్తూరు జిల్లాకు చెందిన అమరనాథ రెడ్డి ఒకరు. చంద్రబాబు నాయుడును నడిరోడ్డుపై
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు దక్కించుకుని జగన్ పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అందులో చిత్తూరు జిల్లాకు చెందిన అమరనాథ రెడ్డి ఒకరు. చంద్రబాబు నాయుడును నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదని జగన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఫైరయ్యారు.
అయితే మంత్రి అమరనాథ రెడ్డి మాత్రం ఘాటుగానే జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. జగన్ ఇంకోసారి అర్హత మరిచి వ్యాఖ్యలు చేస్తే జగన్ నాలుక కోసేస్తామంటూ హెచ్చరించారు. నంద్యాల ఎన్నికల పర్యటనలో ఉన్న అమరనాథ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అమర్ చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేతలు మండిపడుతున్నారు. మరి వాళ్లేమి అంటారో చూడాలి.