Webdunia - Bharat's app for daily news and videos

Install App

డా॥ సి నారాయణరెడ్డి మృతికి మంత్రి అఖిలప్రియ సంతాపం

అమరావతి : ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆకస్మిక మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, తెలుగుభాష, సాంస్కృతిక శాఖల మంత్రి భూమా అఖిలప్రియ సంతాపం వ్యక్తం చేశారు. సినారె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (15:33 IST)
అమరావతి : ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆకస్మిక మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, తెలుగుభాష, సాంస్కృతిక శాఖల మంత్రి భూమా అఖిలప్రియ సంతాపం వ్యక్తం చేశారు. సినారె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
ఇలాంటి సమయంలో వారి కుటుంబసభ్యులకు మనోనిబ్బరాన్ని, గుండె ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తున్నానన్నారు. సాహిత్య రంగంలో సినారె కృషి ఎన్నటికీ మరువలేనిదని మంత్రి కొనియాడారు. అధ్యాపకుడిగా, సాహితీవేత్తగా, కవిగా, సినీ గేయ రచయితగా ఆయన ఎనలేని కృషిచేశారన్నారు. 
 
సినారె మరణం సాహితీ రంగానికి తీరని లోటని మంత్రి అఖిలప్రియ తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేసిన సేవలు చరిత్రలో మిగిలిపోతాయన్నాని మంత్రి అఖిలప్రియ తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments