Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురు

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (14:11 IST)
ఏపీలోని అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో మరోమారు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు మరోమారు డిస్మిస్ చేసింది. 
 
కాకినాడకు చెందిన తన వ్యక్తిగత కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రదాన నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఆయన కొద్దిరోజుల క్రితం పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు... పోలీసులు 90 రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేయనందున బెయిల్‌ ఇవ్వాలని విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
 
నిర్ణీత సమయంలోనే ఛార్జిషీట్‌ దాఖలు చేశామని.. సాంకేతిక కారణాలతో తిప్పిపంపారని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments