Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులను కంట్రోల్ చేయలేకపోతే రిజైన్ చేయాలి : హైకోర్టు సీరియస్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (15:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ బాస్‌పై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు తీవ్రఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీసులను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ పదవికి రాజీనామా చేయాలంటూ ఒకింత కన్నెర్రజేసింది. 
 
ఏపీ హైకోర్టు ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. దీనిపై బాధితుడి మేనమామ సుంకర నారాయణ స్వామి హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయడం జరిగింది. ఆ తర్వాత పిటిషనరు పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్టు వార్తలు వచ్చాయి. 
 
ఈ వెంకటరాజు అదృశ్యం కేసులో పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. గతంలో మూడు కేసుల్లో జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని.. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యనించింది. అలాగే ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 
 
అంతేకాకుండా, గతంలో పలుమార్లు డీడీపీని కోర్టుకు పిలిపించినా ఏమాత్రం మార్పు రాలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు.. పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు కన్నెర్రజేసింది. పనిలోపనిగా, ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పుతుందని న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments