Webdunia - Bharat's app for daily news and videos

Install App

RGV : రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు నుంచి ఉపశమనం - 6వారాల పాటు రిలీఫ్

సెల్వి
గురువారం, 6 మార్చి 2025 (14:10 IST)
ప్రఖ్యాత చిత్ర నిర్మాత రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఉపశమనం లభించింది. ఆరు వారాల పాటు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. వర్మ నటించిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా కుల ఉద్రిక్తతలను రెచ్చగొట్టిందనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది.
 
మంగళగిరి నివాసి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ వర్మపై కేసు నమోదు చేసింది. ఇందుకు వర్మ కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా, వర్మ తనపై ఉన్న కేసు రాజకీయంగా ప్రేరేపించబడిందన్నారు. 
 
సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికేషన్ పొందిన తర్వాతే 2019లో సినిమా విడుదలైందని వర్మ ఎత్తి చూపారు. సినిమా విడుదలైన సంవత్సరాల తర్వాత 2024లో కేసు దాఖలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని కోర్టుకు తెలియజేసారు.

ఈ కేసు ఆధారంగా సీఐడీ తదుపరి చర్యలపై స్టే జారీ చేయాలని వర్మ హైకోర్టును కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన తర్వాత, హైకోర్టు వర్మకు అనుకూలంగా తీర్పునిస్తూ, తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments