Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కిల్ కేసులో ఏఏజీ గైర్హాజరు... చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (13:25 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోమారు వాయిదాపడింది. శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణకు ఏఏజీ హాజరుకాలేదు. దీంతో విచారణను వాయిదా వేసింది. 
 
ప్రస్తుతం ఆయనకు ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలై తన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదే కేసులో ఆయన పూర్తి స్థాయి బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 
 
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగాల్సివుండగా, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు హాజరుకాలేదు. ఏఏజీ నేడు విచారణకు హాజరుకాలేకపోతున్నారంటూ సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద హైకోర్టుకు తెలిపారు. 
 
తమకు మరింత సమయం కావాలని కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments