Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయోమెట్రిక్‌ హాజరుతో మెలిక : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (10:08 IST)
రెండేళ్ల సర్వీసు పూర్తవడంతో ప్రొబేషన్‌ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. బయోమెట్రిక్‌ హాజరు లేదని అక్టోబరు జీతంలో కొందరికి 10 శాతం, మరికొందరికి 50 శాతం మేరకు వేతనాల్లో కోత విధించారు. 
 
ఈ మేరకు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 22 వరకు హాజరుకు సంబంధించిన డాటా జిల్లాలకు చేరింది. వీటి ఆధారంగానే ఉద్యోగులకు జీతాలను వేయాలని డ్రాయింగ్‌, డిజ్బర్స్‌మెంట్‌ అధికారుల(డీడీవో)ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ (ఆర్‌సీ నంబరు: 1/ఏ/2021) ఆదేశించింది. 
 
అయితే... క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా హాజరు లేదని జీతాల్లో కోత విధించడంపై ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు శనివారం మండల అధికారులకు వినతులు ఇచ్చారు. సాంకేతిక సమస్యలను సరిచేసి మరోసారి హాజరు, జీతాల డాటాను రూపొందించాలని కోరారు.
 
సిగ్నల్‌ సమస్యతో కొన్ని చోట్ల బయోమెట్రిక్‌ ఆన్‌లైన్‌ విధానం సరిగా పనిచేయక పోవడం, కొన్నిచోట్ల డివైజ్‌లు అందుబాటులో లేక దస్త్రాల్లోనే సంతకాలు చేయాల్సిరావడం తదితర సాంకేతిక సమస్యలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments