మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

ఠాగూర్
బుధవారం, 29 అక్టోబరు 2025 (17:59 IST)
మొంథా తుఫాను రాష్ట్రంలో అపార నష్టాన్ని చేకూర్చిపెట్టిందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో వెళ్ళి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవు పునరావాస కేంద్రాన్ని పరిశింలించి, తుఫాను బాధితులను పరామర్శించి, బాధితులకు నిత్యావసరవస్తువులు, తగిన పరిహారం అందజేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మొంథా తుపానుపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గతంలో తుఫానుల సమయంలో పనిచేసిన అనుభవం నాకు ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం లేకుండా చూశాం. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నాం. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం. కౌలు రైతులకు పరిహారం అందిస్తాం. మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం'' అని సీఎం తెలిపారు. 
 
మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ప్రభుత్వ ఆదేశాల మేరకు... తుఫాను వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెరను ఉచితంగా అందించనున్నారు. తుఫాను ప్రభావానికి ఎక్కువగా గురయ్యే మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేకంగా 50 కేజీల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments